అనుకున్నదే అయింది. వెలుగు పత్రిక, వీ6 చానెల్ పై బీఆర్ఎస్ బ్యాన్ పెట్టింది. ఇకపై తమ సర్కిళ్లలో ఆ పత్రికలో పనిచేసేవారి మొఖం కనబడకూడదని, ఛానెల్ ప్రతినిధుల నుంచి ప్రశ్నలు వినిపించకూడదని తెగేసి చెప్పింది. కారణం ఏమిటయ్యా అంటే.. అది బీజేపీ పత్రిక కాబట్టి రానివ్వబోమని అంటున్నాడు మంత్రి కేటీఆర్. వారి నమస్తే తెలంగాణను,
తెలంగాణ టుడేను, టీన్యూస్ చానెల్‌ను బీజేపీ బహిష్కరించింది.కాబట్టి తాము కూడా వెలుగును
బహిష్కరించాం.. చెల్లుకుచెల్లు అన్న ధోరణిలో మాట్లాడుతున్నాడు.
అసలు వీ6, వెలుగును బహిష్కరిస్తే ఏం జరుగుతుంది? మహా అయితే పార్టీ, ప్రభుత్వ యాడ్స్ ఇవ్వరు. నిజానికి ఇప్పటికే అవి ఇవ్వడం
లేదు. ఇక ప్రెస్‌మీట్లకు పిలవరు, నష్టమేముంది? వార్త కవర్ చేయాలంటే
ప్రెస్‌మీట్ వివరాలు తెలిస్తే చాలదా..? మీటింగులకు పిలవరు.. అదేం పెద్ద సమస్యే కాదు.. యూట్యూబ్ లైవ్ లో చూసి చూసి తమకు కావాల్సిన కథనాన్ని రాసుకుంటారు. అవసరమే లేదనుకుంటే వదిలేస్తారు. సో ఈ నిషేధంతో బీఆర్ఎస్ సాధించేదేం లేదు.. వీ6, వెలుగుకు పోయేదీ ఏం లేదు.
ఇక వీ6 చానెల్ డిబేట్లకు బీఆర్ఎస్
నేతలను పోనివ్వరట.సో వాట్.. అసలు టీవీలలో పొలిటికల్ డిబేట్లనే పెద్దగా ఎవడూ చూడరు.. వాటి
టీఆర్పీలు చూస్తేనే అర్థమవుతుంది.. సగటు జనం ఈ డిబేట్లను అస్సలు
పట్టించుకోరు. కనుక బీఆర్ఎస్ నిర్ణయం ఏదో పార్టీపరమైన స్పర్థ తప్ప దానికీ ఒరిగేదేమీ
లేదు… కాకపోతే ఒక్క లాభం… ప్రెస్‌మీట్లలో తమని ప్రశ్నించేవారు ఉండరు.. అంతే తప్ప పెద్దగా జరిగిదేం ఉండదు..
Comments
Post a Comment