Skip to main content

తెలంగాణలో ఆంధ్రజ్యోతి ప్రతిపక్ష పాత్ర..!



కొన్ని రాజకీయ వార్తలకు సంబంధించి… ఉద్దేశపూర్వకమైన యాంటీ జగన్ స్టోరీలకు సంబంధించి… ఆంధ్రజ్యోతి పాత్రికేయం పరమ చికాకు యవ్వారం..! కానీ అవి వదిలేస్తే చాలాసార్లు తనను మెచ్చుకునే పరిస్థితిని క్రియేట్ చేస్తాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… ఏపీ పాత్రికేయం ఓ భ్రష్టుపట్టిన తంతు… కానీ తెలంగాణ విషయానికొస్తే రాయాల్సింది బోలెడు… కానీ…

ప్రతి పత్రిక నమస్తే తెలంగాణను మించి కేసీయార్‌ను, తన పథకాల్ని కీర్తిస్తూ, ఆ సేవలోనే పునీతమై తరిస్తోంది… చివరకు నిష్పాక్షికంగా ఉండాల్సిన, ఉండతగిన సాక్షి కూడా నమస్తే సాక్షి అయిపోయింది… మించిపోయింది… చదవబుల్ వార్తొక్కటీ లేదేమని పాఠకజనం తిరస్కరిస్తుంటే, ఛీత్కరిస్తుంటే, పత్రికలో పనిచేసే వాళ్లందరమూ తలా పది పేపర్లు అమ్ముకుందామనే బృహత్ సంకల్పం తీసుకుంది… ఇక  ఏనాడో వెన్ను వంగిపోయిన ఈనాడు గురించి చెప్పుకోవడం ఉత్త దండుగమారి ప్రయాస… అదిప్పుడు నిప్పులు (ప్రొఫెషనల్ ఫైర్) ఆరిపోయి, కనిపిస్తున్న ఓ బూడిద వార్తల కుప్ప…

ఎస్… పత్రిక అంటే భజన కాదు… అవసరమైనప్పుడు అది ‘కాగ్’ పాత్ర పోషించాలి… అవసరంగా మారి ఫ్యాక్ట్ ఫైండింగ్ మెకానిజంగా మారాలి… దర్యాప్తులు చేయాలి… గూఢచర్యం కూడా తప్పదు… జనం వెంట నిలవాలి… ప్రభుత్వాల పథకాల్లోని డొల్లతనాన్ని, ఫాయిదా దందాను బయటపెట్టాలి… ఈ ఆంధ్రజ్యోతి కథనం అదే… కేసీయార్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ, భ్రమాత్మక తెలంగాణ మోడల్‌కే హైలైట్ అని చెబుతూ… దేశవ్యాప్తంగా ఏటా 25 లక్షల మందికి వర్తింపజేస్తానంటున్న దళితబంధు ఆచరణ తీరు ఎలా ఉందో తేటతెల్లం చేసింది…

ఈరోజుకూ దళితబంధు మీద స్పష్టమైన మార్గదర్శకాల్లేవు… అప్ప్పటికప్పుడు పొలిటికల్ ఫాయిదా కోసం ఉద్దేశించిన పథకం కదా… ఉద్యోగులకే సమయానికి జీతాలివ్వలేని దురవస్థలో… ఇక దళితబంధుకు నిధులేవీ..? లబ్ధి దరఖాస్తుదారులు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చుట్టూ తిరగాలి… ఇతర పార్టీల వారికి సారీ, వర్తింపజేయరు… అంతంత మాత్రం అమలు జరిగే ఈ పథకానికి బడ్జెట్‌లో ఘనంగా 17,700 కోట్లు కేటాయించింది… పేరు గొప్ప… అంకెల్లో గొప్ప… బడ్జెట్ పరిమాణంలో గొప్ప… పటాటోపంలో గొప్ప…

తీరా చూస్తే ఆ కేటాయింపులో ఖర్చుల్లేవు… ఇదీ ఆంధ్రజ్యోతి కథన సారాంశం… ఇలాగే తవ్వితే కాలేశ్వరం అసలు ప్రయోజనాలు, కల్యాణలక్ష్మి అమలు తీరు, నిజమైన రైతుకు దక్కని రైతుబంధు, 24 గంటల సాగు కరెంటు, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు… వాట్ నాట్..? బోలెడు అంశాలు… కానీ ఇతర పత్రికలు చేస్తున్నదేమిటి..? అదుగో ఈశాన్యంలో పాగా… జోర్‌దార్ యాక్షన్ ప్లాన్… బీఆర్ఎస్‌పై దేశం చూపు… చేరికలు, విలీనాలకు పార్టీల వెంపర్లాట… అంటూ కేసీయార్ పాదముద్రల్లో పూలు జల్లుతూ పునీతం అవుతున్నాయి… ఇలాంటి కీర్తికీర్తనలు అంతిమంగా తనకు ప్రజల్లో కౌంటర్ ప్రొడక్ట్స్ అవుతాయనే సంగతిని కేసీయార్ ఎలా విస్మరిస్తున్నాడో మరి..!!


muchata.com సౌజన్యంతో...

Comments

Popular posts from this blog

రేవంత్ రెడ్డికి మీడియా సహకరించట్లేదా?

అం గట్లో అ న్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టుగా తయారైంది పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిస్థితి. ఓ జాతీయ పార్టీకి రాష్ట్రఅధ్యక్షుడు.. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గానికి ఎంపీ..తెలంగాణలో అత్యధిక మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్లలో ఒకడు. డబ్బులకు కొదవ లేదు.. డైలాగుల విషయంలోనూ కొట్టేవాడే లేడు.ఇలా కావాల్సినన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా  ఎందుకో రేవంత్ రెడ్డికి  మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దక్కాల్సినంత కవరేజ్ దక్కడం లేదన్నది ఆయన అభిమానుల మాట.  కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తున్న ఛానెల్సే కాదు.. మిగిలినవాటిలోనూ అదే పరిస్థితి ఎదురవుతోందని వారు చాలా బాధపడిపోతున్నారు. వాస్తవానికి వాళ్ల ఆవేదనలోనూ నిజం లేకపోలేదు.          రేవంత్ ఏదైనా భారీ బహిరంగ సభ నిర్వహించినప్పుడో.. ఏదైనా అతి ముఖ్యమైన అంశంపై  ప్రెస్ మీట్ పెట్టినప్పుడో లేదా మరేదైనా విషయంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినప్పుడో వంటి సందర్బాల్లోనే మాత్రమే రేవంత్ రెడ్డికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కాస్త స్క్రీన్ స్పెస్  దొరుకుతోంది. అదికూడా ఏదో నాలుగు నిమిషాలు బ్రేకింగ్ ప్లేట్లు వేసి అటూ, ఇటూ తిప్పి ఆ మేటర్ ని ముగించేస్తున్నాయి .మళ్లీ ఆయన గురించి ఏ న్యూస్ ఛానెల్ లోనూ వార

టీవీ 9 లుక్‌ని కాపీ కొట్టేసిన ABN ఆంధ్ర‌జ్యోతి!

వా ర్షికోత్స‌వం అన‌గానే ఏ ఛానెల్ అయినా.. స్క్రీన్ లుక్‌ని మార్చేసుకోవ‌డం స‌హ‌జం. మొన్నే 11వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ABN ఆంధ్ర‌జ్యోతి ఛానెల్‌ రూపు రేఖ‌లు కూడా బాగా మారిపోయాయి. మార్పు మంచి విష‌య‌మే కానీ.. అదేంటో ABN ఆంధ్ర‌జ్యోతి  యాజ‌మాన్యానికి మ‌రో స్టైలే దొర‌కలే‌ద‌న్న‌ట్టు అచ్చు టీవీ 9 లుక్‌ని ఉన్న‌దున్న‌ట్టుగా దింపేసింది. ABN ఆంధ్ర‌జ్యోతి, టీవీ 9ని స్క్రీన్‌ల‌ని ప‌క్క ప‌క్క‌న‌ చూసిన‌ప్పుడు రెండు ఛానెళ్లూ ఒకేలా క‌నిపిస్తున్నాయి. ABN ఆంధ్ర‌జ్యోతి స్క్రీన్  క్వాలిటీ కొంచెం త‌క్కువ కావ‌డం,  రెండు ఛానెళ్ల లోగోలు వేర్వేరు కాబ‌ట్టి కొంచెం తేడాగా ఉన్నాయే త‌ప్ప‌..  మిగ‌తా అంతా ఒకేలా క‌నిపిస్తున్నాయి.  పైన టాప్, కింద స్క్రోలింగ్ డిజైన్ జ‌స్ట్ అలా కాపీ చేసింది ABN ఆంధ్ర‌జ్యోతి. మ‌రో విశేషం ఏమిటంటే.. చాలా సార్లు టీవీ 9 ఏ ఇష్యూపై ఫోక‌స్ చేస్తుందో.. ABN ఆంధ్ర‌జ్యోతి  కూడా దాన్నే ఫాలో అవుతోంది.  ఫైన‌ల్లీ..  అంత‌లా కాపీ కొడుతున్నా రేటింగుల్లో మాత్రం టీవీ 9 టాప్‌లో ఉంటే  ABN ఆంధ్ర‌జ్యోతి   లిస్ట్‌లో ఎక్క‌డో కిందే ఉండిపోవ‌డం కొస‌మెరుపు.

TV5 కూడా TRS అండ్ కో చేతుల్లోకి?

ఆం ధ్రప్రదేశ్ విభజన తర్వాత.. తెలుగు మీడియా రంగంలో ఎవ్వరూ.. ఎన్నడూ ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా టాప్ 3గా చెప్పుకునే TV9, TV5, NTV ఛానెల్స్.. ఒక్కోదాని రంగు- రుచి- వాసన పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు పచ్చమీడియా అంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలతో తిట్టిన తిట్లు తిట్టించుకోని TV 9.. ఆ తర్వాత అనూహ్యంగా మైహోం గ్రూప్ చేతుల్లోకి చేరి ఇప్పుడు గులాబీ గిరి చేస్తోంది.ఇక NTVలోనూ మైహోం గ్రూప్ షేర్స్ ఉన్నాయని చెప్తుంటారు.అందుకే ఆ ఛానెల్ కూడా టీఆర్ఎస్ హైకమాండ్ ను నొప్పించకుండా మసులుకుంటూ వార్తల ప్రసారం సాగిస్తోంది. ఇక తాజాగా ఈ లిస్ట్ లోకి ఇప్పుడు TV5 కూడా చేరిపోయింది. ఇన్నాళ్లు ఫక్తూ టీడీపీ వాయిస్ వినిపించిన ఈ ఛానెల్.. ఇకపై పింక్ ఇంక్ నింపుకోబోతోంది. TV5 ని మైహోం గ్రూప్ టేకోవర్ చేయబోతోందని మీడియా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అలాగే టీఆర్ఎస్ కీలక నేత బంధువులు కూడా ఈ ఛానెల్ లో ఓ‌ హ్యాండ్ వేయబోతున్నారని తెలుస్తోంది. సో రానున్న రోజుల్లో TV5 గతానికి భిన్నంగా కనిపిస్తే..వినిపిస్తే షాక్ కావొద్దు సుమా!